27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యోగ విన్యాసాల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

12వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న దయానంద యోగ కేంద్రంలో గురువారం యోగ విన్యాసాల పోటీలను నిర్వహించినట్లు యోగ ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యోగ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే యోగ సాధన అలవాటు చేసుకుని, యోగ విన్యాసాల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి మంచి ఫలితాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రాంచందర్, జిల్లా యువజన అధికారి రమేష్, ఆయుష్ వైద్యులు డాక్టర్ శ్రీవాణి, వెంకటేష్, తిరుపతి, ఆయుష్ డీపీఎం వందన, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగ గురువులు సంగీత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయుష్ సిబ్బంది, యోగ గురువులు, విద్యార్థులు, విద్యార్థినులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article