24 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామాల్లో టిఆర్ఎస్ జెండాలను ఎగర వేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పార్టీని బలోపేతం చేయాలి

 

. . . టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్

 

లింగంపేట, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ నెల 19 న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలని ఎగరవేసి నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ సూచించారు. మంగళవారం లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గద్దెలను నిర్మాణం చేసి ఈనెల 19 పార్టీ జెండాలను ఎగరేసిన అనంతరం గ్రామాలలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించాలని ఆయన సూచించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన పార్టీ పెట్టిన విషయాన్ని ప్రజలకు వివరించాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టనున్న పాంచజన్యం పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పార్టీ నాయకులు గడప గడపకు వివరించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రానికి సినీ నటుడు విజయ్ సీఎం అయినట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సీఎం కావడం పక్కా అని సంపత్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పిటిసి) ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో అత్యధిక స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని వెల్లడించారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగంపేట నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, తాడ్వాయి, సదాశివ నగర్, గాంధారి మండలాల అధ్యక్షులు పోకల సాయిరాం, సుభాన్ రెడ్డి, బాబు, భుజంగరావు, సాయగౌడ్, ఆర్ల కృష్ణమూర్తి, కామారెడ్డి మండల అధ్యక్షుడు ఎండి ఫయీమ్, జిల్లా ఎస్టీ సెల్  అధ్యక్షులు జైల్ సింగ్, లింగంపేట మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఆరు మండలాలు చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

TRS flags should be hoisted in the villages.

More articles

Latest article