25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నందిపేటలో కత్తిపోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యువకుడిపై కత్తి, రాడ్లతో దాడి

 

. . . నిజామాబాద్ ఆసుపత్రికి క్షతగాత్రుడు

 

. . . ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండల కేంద్రంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కొందరు మారణాయుధాలతో విరుచుకుపడిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. నందిపేట్ గ్రామ ​రాజ్‌నగర్‌కు చెందిన పెయింటర్ షేక్ నయీం (30) పై ఆదివారం ఉదయం కత్తులు, ఇనుప రాడ్లతో మూక ఉమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దారుణంలో బాధితుడి తల, చేతులు, కడుపు లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Stabbing incident causes a stir in Nandipet.

 

ప్రస్తుతం అక్కడ అత్యవసర చికిత్స అందుతోంది. ​బాధితుడి వదిన వసీమ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. షేక్ తారిఖ్, తాహెర్, సాజిద్, షాహిద్, గాలిబ్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే ప్రతీకారంతో ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దాడికి దారితీసిన అసలు కారణాలు, ఇతర పూర్తి విషయాలు పోలీసుల లోతైన దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

 

Stabbing incident causes a stir in Nandipet.

More articles

Latest article