. . . ప్రభుత్వ పాఠశాలలకు సీఎం నిధులను కేటాయించాలి
. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని, వాటిని నాలుగువేల పాఠశాలకు తగ్గిస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని, అప్రజాస్వామికమని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. అందరికీ విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 66% మంది విద్యార్థులు చదువుతుంటే, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 34% విద్యార్థులు చదువుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ బడులకు నిధులు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేయడమే అని మండిపడ్డారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని, బడుల మూసివేత పై సీఎం పునారాలోచన చేయాలని, విద్యకు 20% నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యా రంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
