25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సైక్లింగ్ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా క్రీడా అధికారి బి.పవన్ కుమార్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడా అధికారి బి.పవన్ కుమార్ అన్నారు. ఖేలో ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారం తో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ సౌజన్యంతో నిజామాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ దగ్గర అస్మిత మహిళా సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడం, బరువు తగ్గడం, ఒత్తిడి తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఇది కీళ్లపై తక్కువ ప్రభావం చూపే వ్యాయామం కాబట్టి అన్ని వయసుల వారికి సరిపోతుందన్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ కోసం చాలా మంచిదని తెలిపారు. అనంతరం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు మాట్లాడుతూ ‘అస్మిత’  కార్యక్రమం అనేది మహిళలపై దృష్టి సారించిన ఒక సైక్లింగ్ కార్యక్రమం అని అన్నారు. సైక్లింగ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వర్ధమాన ప్రతిభను గుర్తించడం, ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం ఈ పోటీ యొక్క ముఖ్య లక్ష్యాలు అన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వయసుల పాఠశాల, కళాశాలల విద్యార్థినిలు, యూనివర్సిటీ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంరతం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారిణిలకు మెడల్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిచ్ పల్లి ఎమ్మార్వో సతీష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లు సూర్య ప్రకాష్, రాజ్ కుమార్ సుబేధర్, కుంట గంగ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు రాకేష్, ఆకుల నరేష్, దుర్గ మల్లేష్ గాజుల శేఖర్, గడ్డం రవి, తెలంగాణ యూనివర్సిటీ ఫిజికల్ డైరక్టర్, వ్యాయామ ఉపాధ్యాయులు డా.నేత స్వామి కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Cycling is essential for mental and physical health.

More articles

Latest article