29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బుకింగ్ యాప్ వల్ల రైతులకు తప్పని తిప్పలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఆన్ లైన్ ఎరువుల బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. యూరియా గురించి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా ఆన్ లైన్ బుకింగ్ యాప్ మండల స్థాయి  ప్రాతిపదికను మార్చి స్థానిక సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపులకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అలాగే ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్ లైన్ ఎరువుల బుకింగ్ యాప్ వల్ల రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అయితే ప్రస్తుత విధానంలో యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకునేందుకు ‘మండలాన్ని’ ప్రామాణికంగా తీసుకోవడం క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులను కలిగిస్తోందని వివరించారు. మండల కేంద్రం లేదా యాప్ సూచించిన పంపిణీ కేంద్రాలు అనేక గ్రామాలకు దూరంగా ఉంటున్నాయని, దీనివల్ల బుక్ చేసుకున్న యూరియా బస్తాలను తమ గ్రామాలకు తరలించుకోవడానికి రైతులు అదనపు రవాణా ఖర్చులు భరించడంతో పాటు వ్యయప్రయాసలకు గురవుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి, యాప్ ‘మండల యూనిట్ కి ‘ బదులుగా రైతులకు అత్యంత చేరువలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) లేదా స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్ దుకాణాలను పంపిణీ యూనిట్లుగా మార్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల నవీన్, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు రేపల్లి సాయి ప్రసాద్, బోజిగొండ అనిల్, బేగరీ వినోద్ కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, బేగరి సాయికుమార్, అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్, కోశాధికారి కటిగా రామరాజు, మండల సీనియర్ నాయకులు వెంకటేశ్వర గుప్తా, పార్వతి మురళి, సూర్యకాంత్, రాజవరప్రసాద్, జీలకర్ర మహేందర్, శ్యామ్,  మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article