24 C
Hyderabad
Sunday, August 2, 2026

సంస్కార భారతి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

సంస్కార భారతిలో పలువురికి కిలక భాధ్యతలు అప్పగింత

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

రామకృష్ణ ధ్యాన మందిరంలో సంస్కార భారతి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.  సంస్కార భారతీ సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోవడానికి ఎస్ .మాధురి ని కార్యదర్శి, మాతృశక్తి కన్వీనర్ గా వరలక్ష్మిని, ఉపాధ్యక్షులుగా మాధవి ని, నాగనాథ్ గుప్త ని, దృశ్యకల ప్రముఖ్ గా సాయి రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశం రాజకుమార్ సుబేదార్ ఆధ్వర్యంలో సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్ మార్గనిర్దేశకత్వం లో నిర్వహించారు. రాబోయే కాలంలో బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతం రచించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, గురు పౌర్ణమి సందర్భంగా నటరాజ పూజోత్సవాన్ని నిర్వహించాలని, తీర్మానం జరిగింది ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ ఎన్ శంకర్ , బి. మల్లేష్ , జి. ప్రసాద్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి మధుసూదనాచారి రాధాకృష్ణ, బి. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article