24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పేదలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పెద్ద కొడప్ గల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ లోజుక్కల్ ఎమ్మెల్యే

 బిచ్కుంద, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో అనేక మంది పేద ప్రజలకు హామీలు ఇచ్చి, పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు.

The Congress party will fulfill the promises made to the poor

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా పట్టాలు అందజేస్తూ, వారి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాహసీల్ధార్ తో పాటు కాంగ్రెస్ మండల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామ సర్పంచ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

The Congress party will fulfill the promises made to the poor

More articles

Latest article