29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాల కుదింపుపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

.

 . . . డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యం. సోమయ్య డిమాండ్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని *డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్ )రాష్ట్ర అధ్యక్షుడు యం. సోమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యం. బాలయ్య అధ్యక్షతన ఏర్పాటు అయిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి డి టి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యం. సోమయ్య ఎన్నికల అధికారి హాజరై కౌన్సిల్ ఉద్దేశించి మాట్లాడుతూ…తాము అధికారంలోకొస్తే ఒక్క పాఠశాల కూడా మూసివేయనని, బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తానని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రైవేటు విద్యారంగాన్ని, ఫీజులు నియంత్రిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగాల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తిరోగమన విధానాన్ని ప్రకటించడం సరికాదన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు సమగ్రంగా అధ్యయనం చేయకుండా, ఇలా పాఠశాలలను మూసి వేసుకుంటూ వెళితే త్వరలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా కనుమరుగై, విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా పేద విద్యార్థులకు విద్య అందకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ చర్య ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయి అన్నారు. ఈ కుదింపు ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా చేపట్టే విధానాలే అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. పిఆర్సి నివేదిక 40% ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ పడిన సిపిఎస్ రద్దు పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కౌన్సిల్ సమావేశానికి పరిశీలకులుగా హాజరైనా డి టి ఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  పి.శంతన్ కౌన్సిల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ….బడ్జెట్ లో విద్యారంగానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15 %నిధులను  కేటాయించి, విద్యారంగ ప్రతిష్టలకు చర్యలు తీసుకోవాలని ప్రతి ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, సరైన పర్యవేక్షణ, సరైన మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్  పాఠశాల ఏర్పాటు విద్య అసమానతలు పెంచి పోషిస్తుందని ఇట్టి పాఠశాల ఏర్పాటు విరమించుకోవాలని, కామన్ సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని  పెండింగ్లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, విధి విధానాలు లేకుండా ఈ హెచ్ ఎస్ ఇంట్రిబ్యూషన్1.5% మే నెల నుండి కట్ చేసిన డబ్బులు ఉద్యోగులకు వాపసు చేయాలని,  ఉపాధ్యాయుల పెండింగ్ బిళ్ళులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని,317 బాధితులను సొంత జిల్లాలకు పంపుతూ తక్షణమే న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. ఈనాటి కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఒమాజీ  కార్యదర్శి వేదిక ప్రవేశపెట్టగా కౌన్సిల్లో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం నివేదిక ఆమోదించడం జరిగింది. ఈ కౌన్సిల్ జిల్లా కమిటీ సభ్యులు. విజయ్ కుమార్ , పి,దాసు ఆర్. పెంటన్న అరుణ్ కుమార్ , ఎస్.కె మదర్, వివిధ మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు

 

More articles

Latest article