29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నాగిరెడ్డిపేట పోలీసుల మిడ్ నైట్ చేజింగ్

Must read

📰 Generate e-Paper Clip

. . . ఉత్కంఠభరితంగా సాగిన ఎనిమిది కిలోమీటర్ల చేజ్

. . . ప్రజల సహకారంతో కరుడుగట్టిన వాహనాల దొంగల ముఠా ఆటకట్టు

ఎల్లారెడ్డి, బతుకమ్మ:

చీకటిని చీల్చుకుంటూ బ్లూ కోల్ట్స్..పెట్రో కార్ సిబ్బంది ఉరుకులు, పరుగులు.. వాహనాల దొంగలు రూటు మార్చిన స్థానిక ప్రజల సహకారంతో వారి ఆట కట్టించారు పోలీసులు…కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో నాగిరెడ్డిపేట పోలీసుల వ్యూహాత్మక చక్రవ్యూహం తో పోలీసులు – ప్రజలు కలిసి పనిచేస్తే నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేరని చాటి చెప్పి ఆపరేషన్ విజయవంతమైందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ..

Midnight chase by Nagireddypet police
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాలపేట గ్రామానికి చెందిన మహ్మద్ సైఫుద్ధీన్ తన ఆటో టిస్ 17 టి 0997 ఎల్లారెడ్డి కిరాయి వెళ్లి రాత్రి 9 గంటల ఇంటికి వచ్చి తన ఇంటి లోపల పార్క్ చేసి పడుకో అనగా 3 న తెల్లవారుజామున అందాజా 4 గంటలకు లేచి చూడగా తన ఆలో కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఆటో ని దొంగతనం చేశారు అని నాగిరెడ్డిపేట పిఎస్ ఫిర్యాదు చేయగాలో కేసు అయినది. గోపాల్ పేట్ బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది సుమారు రాత్రి గంటల సమయంలోరెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనించారు. వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఒక బైక్ ను అక్కడే వదిలేసి ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై వేగంగా పరారయ్యారు.వెంటనే బ్లూకోల్ట్స్ సిబ్బంది పెట్రో కార్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పెట్రో కార్ సిబ్బంది సురేష్,సుదర్శన్ తమ వాహనంతో అనుమానితుల వెంట పడ్డారు. పోచారం సమీపంలో పెట్రో కారు అడ్డంగా ఉంచి నిందితుల బైక్ ను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు చాకచక్యంగా తప్పించుకుని ఎల్లారెడ్డి వైపు దూసుకెళ్లారు. అయితే పోలీసుల వెనకడుగు వేయలేదు. వెంటనే నాగిరెడ్డిపేట ఎస్ఐకి సమాచారం అందించగా ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఆపరేషన్ మరింత వేగం పుంజుకుంది. పోలీసుల వేట మరింత ఉదృతం కావడంతో మాల్ తుమ్మెద గ్రామగేటు వద్దకు చేరుకున్న నిందితులు తమ బైకు అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు. అప్పటికే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు.

మాల్ తుమ్మెద ఉప సర్పంచ్ కు సమాచారం అందించగా ఆయన క్షణాల్లో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. రాత్రి 3 గంటల సమయంలో గ్రామ యువకులు,గ్రామస్తులు పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చీకటిని చీల్చుకుంటూ టార్చ్ లైట్ వెలుగులో సాగిన ఈ ఆపరేషన్ సినిమా సన్నివేశాలను తలపించింది.పోలీసులు,గ్రామస్తులు ఒత్తిడిని తట్టుకోలేక నిందితులు పోచారం వైపు చేరుకున్నారు. తాము చిక్కుకుపోతున్నామని గ్రహించిన ఇద్దరు నిందితులు తమ గ్యాంగ్ లోని మరో ముగ్గురికి ఫోన్ చేసి లొకేషన్ పంపారు. వెంటనే ఆ ముగ్గురు దొంగిలించిన ఆటోలో పోచారం చెరువు కట్ట ప్రాంతాలకు చేరుకుని తమ సహచరులను తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రణాళిక కూడా విఫలమైంది. బ్లూ కోల్ట్స్ సిబ్బంది వారి కదలికలను గుర్తించి వెంటాడడం తోవారు ఆటోను అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు. అప్పటికే ఆపరేషన్ మరింత విస్తరించింది. ఒకవైపు పోలీసులు,మరోవైపు బ్లూ కోల్ట్స్,పెట్రో కార్ సిబ్బంది,మాల్తుమ్మెద ఉపసర్పంచ్,గ్రామస్తులు పోచారం యువకులు,గ్రామస్తులు కలిసి ఐదుగురు అనుమానితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. పరిస్థితి ముందుగానే అంచనా వేసిన నాగిరెడ్డిపేట ఎస్ఐ,మెదక్ జిల్లా జక్కన్నపేట సర్పంచ్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన గ్రామస్తులతో కలిసి గ్రామ ప్రవేశ మార్గం వద్ద అప్రమత్తంగా మోహరించారు. వెనుక నుంచి పోలీసులు,గ్రామస్తులు వదలకుండా వెంబడిస్తుండగా,ముందువైపు జక్కన్నపేట గ్రామస్తులు,నాగిరెడ్డిపేట ఎస్ఐ పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండటం తో నిందితులు అక్కడి నుంచి తప్పించుకొని పోచారం వైపు రాగా వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు నలుగురు అనుమానితులను చాకచక్యంగా పట్టుకున్నారు. మరో వ్యక్తి మాత్రం చీకటి ప్రయోజనం తీసుకుని పరారయ్యాడు. అట్టి వ్యక్తిని త్వరలో పట్టుకుంటాము అని డిఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో చింత బాలరాజ్ పై ( 43) వాహనాల దోంగతనాల కేసులు, పరారీలో ఉన్న షేక్ ఫయాజ్ పై 37 కేసులు, కార్తీక్ రెడ్డి పై 3 కేసులు, అయిటి రమేష్ పై 1 కేసు ఉందని, పట్టుబడిన మైనర్ పై 3 కేసులు ఉన్నాయని తెలిపారు. పట్టుబడిన నలుగురు తమ నేరాన్ని అంగీకరించి హైదరాబాద్ ,సైబరాబాద్, రాచకొండ,మెదక్,నాగర్ కర్నూల్,సంగారెడ్డి జిల్లాల పరిధిలో గతంలో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. వారి వద్ధ నుంచి 3 ఆటో లు ,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్లో నిందితులను వెంబడించి పట్టుకున్న నాగిరెడ్డి పేట్ ఎస్ఐ.ఏ. భార్గవ్ గౌడ్, కానిస్టెబుళ్లు సురేష్ గౌడ్, సుదర్శన్,వాజీద్ లు పోలీసులు సహకరించిన మాల్ తుమ్మెద, పోచారం జక్కన పేట గ్రామస్తులు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.

More articles

Latest article