29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సీయండి చేతుల మీదుగా సర్కిల్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

Must read

📰 Generate e-Paper Clip

 

వరంగల్, బతుకమ్మ:

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ లోని ఎన్పీడీసీఎల్ కంపెనీ ఆవరణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన నిజామాబాద్ సర్కిల్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు అభినందిస్తూ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె వరుణ్ రెడ్డి ప్రశంసా పత్రం తో అభినందించారు. సారంగపూర్ ఎఇ (ఆపరేషన్) పి.శ్రీనివాస్, నిజామాబాద్ ప్రొటెక్షన్ ఎఇ భాస్కర ప్రసాద్, నిజామాబాద్ టౌన్ ఈఆర్ఓ ఎఓ పి.అశోక్, మెండోరా సబ్ ఇంజనీర్ ఎం ప్రసాద్, సిరికొండ లైన్ ఇన్స్ పెక్టర్ బాల చందర్, ఆర్మూర్ టెస్టర్ గ్రేడ్ 2 నవీన్ చారీ, ఏర్గట్ల లైన్ మెన్ దత్తయ్య, బోర్గాం (పి) అసిస్టెంట్ లైన్ మెన్ దిలీప్ లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స్ మోహన్ రావు, మధుసూదన్, ప్రభాకర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article