26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి కాముక తెలంగాణ

Must read

📰 Generate e-Paper Clip

-ఇంఛార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ

-జిల్లాకోర్టు సముదాయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:  

*సకల జనుల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఇంచార్జీ నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రాష్ట్రం ప్రగతి ప్రధాన వెళుతుందని తెలిపారు.తెలంగాణ  పురోగమనంలో న్యాయ వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.

Telangana is a prosperous country with people's participation

అనంతరం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు బార్ తరపున జాతీయ జెండాను ఎగురవేసిన కార్యక్రమంలో జిల్లా జడ్జి సుగాలి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమకారుల బాగోగులు బాధ్యత తీసుకుని న్యాయ సేవలు అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య అంగరి, వడ్డి హరి కుమార్, బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి, కోశాధికారి మధుసుధన్ గౌడ్, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, ఇంచార్జి డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ మహమ్మద్ రహీమోద్దీన్, న్యాయవాదులు మధుసూదన్ రావు, జగన్ మోహన్ గౌడ్, మాణిక్ రాజు, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి గోవింద్ రావు, జ్యూడిషియల్ ఉద్యోగ నాయకులు అంజల్ రెడ్డి. లింగారెడ్డి, రషీద్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Telangana is a prosperous country with people's participation

More articles

Latest article