24.7 C
Hyderabad
Monday, August 3, 2026

టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్,  బతుకమ్మ :

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  స్వరాష్ట్ర సాధనలో తొలి,మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీలను స్మరించుకొని యేలాగైతే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకునేంతవరకు, అంతఃకరణ శుద్ధితో ఉద్యమించి, ఉద్యోగులందరం నేడు ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేరవేయటలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుదలకు తోడ్పాటు అవుతున్న ఉద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరవేయటలో ప్రముఖ పాత్ర వహించి ,రాష్ట్రంలోనే జిల్లాను ప్రముఖ స్థానంలో నిలుపుటకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్,టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, సునీత, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్,మారుతి జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్, స్వామి, మంగమ్మ, రాజేశ్వర్, ఆంజనేయులు, క్లాస్ ఫోర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాస్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article