27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ:

 

రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు. ముప్కాల్ గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోల ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోహన్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆర్మూర్‌కు చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లోక ముత్యం రెడ్డి తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వేంపల్లి గ్రామంలో తోగారి రామకృష్ణ నానమ్మ మరణించగా, లక్కోరా గ్రామంలో వేల్పూర్ సొసైటీ మాజీ డైరెక్టర్ చేపూర్ గంగాధర్ తల్లి చేపూర్ గంగుబాయి మరణించడంతో ఆయా కుటుంబాలను పరామర్శించారు. అలాగే అంక్సపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొత్తూరు మహిపాల్ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. కుకునూర్ గ్రామంలో మర్రి మల్లారెడ్డి తండ్రి చిన్న గంగారెడ్డి, అలాగే బక్కయి రాజన్న తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించిన మోహన్ రెడ్డి, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Manala Mohan Reddy visits the affected families

More articles

Latest article