24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వెంబడించి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దుండగులు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోరా, బతుకమ్మ :

 

గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి రెండు తులాల బంగారు గొలుసును అపరించుకొని వెళ్లినట్లు మెండోరా ఎస్సై సువాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం సోంపేట గ్రామానికి చెందిన ఉప్పరి గణపతి ముప్కాల్ వైపు నుండి తన కూతురు, భార్య గంగు తో కలిసి సోంపేట గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో గల బుస్సాపూర్ యూటర్న్ వద్ద వెంబడించిన గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి గంగు మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు అపరించుకొని వెళ్లినట్లు పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More articles

Latest article