. . . 11,10,000 జరిమానా విధించిన కోర్టు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన వారంలో డ్రంకన్ డ్రైవ్ లో పట్టు బడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరు పరచగా ఇందులో 9 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికీ రూ. 11,10,000 జరిమానా విధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు తమ వద్ద ఉంచుకోగలరని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుందని, మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడుతుందని, అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు.
