24 C
Hyderabad
Sunday, August 2, 2026

19న సిపిఎం కామారెడ్డి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్: ఈ నెల 19న కామారెడ్డిలో జరిగే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు.  బుధవారం జుక్కల్ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం జుక్కల్ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సిపిఎం గ్రామ శాఖ నుండి మండల, జిల్లా మహాసభ నుండి జాతీయ మహాసభల వరకు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలో ప్రజల సమస్యల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ అజయ్ కుమార్, గోవింద్, జై వీరయ్య, షేక్, ఫిర్దోస్, విట్టల్, మోతీరం నాయక్, బి. అడప్ప, టి. సాయిలు, బాలాజీ, సాగర్, సిపిఎం పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article