. . . మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్
ఏర్గట్ల, బతుకమ్మ :
రైతులకి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం సూచిస్తున్న వరి రకాలను రైతులకి అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ అన్నారు. శుక్రవారం మండల ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఉన్న రైతు వేదిక వద్ద మండల పరిధిలోని గ్రామ ఫర్టిలైజర్ షాప్ యజమానులతో ఏవో సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న సందర్బంగా మండలంలోని విత్తన, పురుగు మందు షాప్ యజమానులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాప్ లపై రైతుల నుండి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మండల పరిధిలోని గ్రామ రైతులు లైసెన్స్ కలిగిన విత్తన వ్యాపారుల వద్దనే విత్తనాలు తీసుకోవాలని తెలియజేశారు. వేరే ఎవరైనా లైసెన్స్ లేని వారు విత్తనాలు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని, వారి పైన ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.
