25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో డా.పిడమర్తి రవి పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జూన్ 21న హైదరాబాద్ లోని  ఇందిరాపార్క్ వద్ద జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వ్యవస్థాపక అధ్యక్షులు డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకాల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ కాస్త లేట్ అయినప్పటికీ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చ దిశగా అడుగులు వేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ క్షేత్రస్థాయిలో జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారుల అభిప్రాయాలను సూచనలను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కొంతమంది కుటుంబాలకు సహకారం అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి ఆదుకోవాలని పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఉద్యమకారులందరినీ ఏకతాటిపై తీసుకువటానికి జూన్ 21 హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని దానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఉద్యమకారులు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ పుప్పాల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లాప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి రాజు గౌడ్, కో కన్వీనర్ బరికుంట శ్రీనివాస్, అబ్బి ప్రగతి కుమార్, ఉపాధ్యక్షులు నవతే ప్రతాప్, కార్యదర్శులు మేత్రి రాజశేఖర్, జ్వాల రాణి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article