రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో శుక్రవారం విడిసి ఆధ్వర్యంలో బారెడు పోచమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, విడిసి అధ్యక్షుడు కూర్మరాజు, గ్రామస్తులు రాజయ్య, కరణ్, కార్తీక్, అశోక్, గోపాల్, నాగనాథ్, నవీన్, సుధాకర్, శేఖర్, శంకర్ తదితరులు ఉన్నారు.
