బాన్సువాడ, బతుకమ్మ :
ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు ఈద్ – ఉల్ – అజ్హా ముబారక్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈద్-ఉల్-అజ్హా పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సౌభ్రాతృత్వం నిండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

