27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బ్యాక్ వాటర్ లో మునిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయరాదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి

 

డొంకేశ్వర్, బతుకమ్మ :

 

బ్యాక్‌వాటర్‌లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ కొనుగోలు కేంద్రాల యజమానులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గురువారం ఉదయం జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సిఎస్‌సి ప్రవీణ్, ఏసీఎస్ఓలు కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కూడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

 

Do not buy grain submerged in backwaters.

 

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయడం, ఈ నెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

Do not buy grain submerged in backwaters.

 

అనంతరం నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమా పారా బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి, మిల్లుకు చేరుతున్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ అంగీకార ప్రక్రియ ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యానికి సూచించారు.

 

Do not buy grain submerged in backwaters.

More articles

Latest article