26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసుల ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ఎస్పీ సిందూశర్మ ఆదేశాల మేరకు ఆటో ప్యాసింజర్ల భద్రతపై కామారెడ్డి రూరల్ సర్కిల్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు.  ట్రాఫిక్ రూల్స్, ప్రయాణికుల పట్ల వారి బాధ్యత, వ్యక్తిగత ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్, చేయకూడనివి, చేయాల్సిన బాధ్యతల గురించి వివరాంచారు. అదేవిధంగా పోలీసులతో ఆటో డ్రైవర్లు సమాచారం ఇచ్చి సహాయం పొందే విషయంపై అవగాహన కలిగించారు. ప్రతి ఆటోకి ఒక క్యూఆర్ కోడ్,  వ్యక్తిగత ఇన్సూరెన్స్ రెండు సంవత్సరాల వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో వారి పూర్తి వివరాలు, వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవనపల్లి ఎస్ఐ రాజు, రామారెడ్డి ఎస్ఐ నరేష్, మూడు మండలాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

More articles

Latest article