. . . అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించిన డీఎస్పీ, ఎస్సై
మోర్తాడ్, బతుకమ్మ :
గుండెపోటుతో బాసర రైల్వే స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న జిన్నా జాన్ (55) గురువారం హైదరాబాద్ లోని యశోదలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజుల క్రితం ఎండ దెబ్బ తగలడంతో సెలవు తీసుకొని హైదరాబాద్ లోన యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎండ దెబ్బ తగిలి జాయిన్ అయిన ఆయన యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటు రావడంతో ఆకస్మిక మరణం పొందారు. ఆయన గుండె పోటుతో మరణించడం డిపార్ట్ మెంట్ కు తీరని లోటని హైదరాబాద్ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండలం డొంకల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది రూ.30 వేలు అంత్యక్రియల నిమిత్తం అందజేశారు. బాసర ఏ ఎస్ ఐ మహబూబ్, నిజామాబాద్ రైల్వే పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

