. . . కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలను విక్రయించాలి
. . . మద్నూర్ ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్
జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడంగల్, జుక్కల్ మండలంలోని జుక్కల్ సొసైటీ గోదాంలో బుధవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేశ్, పీఏసీఎస్ ఛైర్మన్ శివానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్నూర్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, సొసైటీ చైర్మన్ శివానంద పటేల్ మాట్లాడుతూ జొన్నలను దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. క్వింటాలుకు ప్రభుత్వం మద్దతు ధర రూ.3,699 ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేశ్, మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, సొసైటీ కార్యదర్శి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
