. . . మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత
బిచ్కుంద, బతుకమ్మ :
దళారుల మోసపూరిత మాటలు నమ్మి తమ పంటను అమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద సంఘ పీఐసీ అధ్యక్షులు నాల్చర్ బాలాజీ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.3699 కేటాయించిందని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తమ జొన్నలను విక్రయించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ శెట్కార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, విట్టల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు దర్పల్ గంగాధర్, నౌష నాయక్, కో ఆప్షన్ మెంబర్ చింతల్ హనుమాన్లు, సొసైటీ సీఈవో శ్రవణ్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.