25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లక్ష్యాల అమలును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పర్యవేక్షణాధికారులు ఉపకేంద్రాలు, పీహెచ్సీల్లో సేవలు, రికార్డులు, లక్ష్యాల అమలును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తన ఛాంబర్‌లో జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా అదే విధంగా పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి క్యాజువల్ లీవ్ రిజిస్టర్ నిర్వహించడంతో పాటు ఆ వివరాలను డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. క్యాష్‌బెండ్ తీసుకునే సందర్భంలో పైఅధికారి ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు 50 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. విహెచ్ఆర్‌లో లేని జనాభాకు కూడా పరీక్షలు నిర్వహించి, గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ బాధితుల వివరాలను సేకరించి ధృవీకరించాలని సూచించారు. తద్వారా పాజిటివ్ కేసుల గుర్తింపు పెరుగుతుందని తెలిపారు. అన్ని పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఇతర శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ప్రతి ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, సూపర్వైజర్ వద్ద డ్యూ లిస్ట్ ఉండాలని, దానికి అనుగుణంగా వ్యాక్సిన్ ఇన్‌డెంట్ తీసుకోవాలని సూచించారు. వాడిన వ్యాక్సిన్ వైల్స్‌ను నిర్దేశిత కాలపరిమితి వరకు భద్రపరచాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీకి కనీసం నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించాలని, ప్రస్తుతం 93 శాతంగా ఉన్న గర్భిణీ పరీక్షలను, ఆభా అటెండెన్స్‌ను 100 శాతానికి పెంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్పీవీ టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అర్హులైన బాలికలకు లక్ష్యాల మేరకు టీకాలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవనశైలి వ్యాధుల పరీక్షలను కేంద్రాల వారీగా పూర్తి చేయాలని, జిల్లాలో 70 శాతం పూర్తయినప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 40 శాతం మాత్రమే నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని 80 శాతం పైగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఓ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న వివరాలను ఫాలోఅప్ ద్వారా పూర్తి చేయాలని, ఏఎన్ఎం వాలిడేషన్ త్వరగా ముగించి ఎంఓ లాగిన్‌కు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ బాధితులందరినీ ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో క్షయరహిత గ్రామాల సంఖ్య పెంచేందుకు ప్రతి గ్రామపంచాయతీని క్షయరహిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి పరీక్షలతో పాటు లైంగిక సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. పీహెచ్సీలు, ఉపకేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. రికార్డులు, నివేదికలు, లీవ్ వివరాలు సక్రమంగా నిర్వహించాలని సీనియర్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ సమావేశంలో డిటిసిఓ దేవి నాగేశ్వరి, డీఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ సికిందర్ నాయక్, డాక్టర్ సమత, డాక్టర్ రవీందర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖర, డాక్టర్ శ్రావ్య, ఎస్‌ఓ రాజేశ్వర్, ఫార్మసీ అధికారి నారాయణ, డిహెచ్ఈ వెంకటేశ్వర్లు, డిపిఓ విశాల, ఏఎంఓ సలీం, క్వాలిటీ మేనేజర్ రాము, డిడిఎం నారాయణ, డిపిసి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

 

The implementation of goals should be checked regularly.

More articles

Latest article