29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయకుండా విద్యార్థులకు నానా ఇబ్బందులు చేస్తూనే ఉందని, దీనిని  నిరసిస్తూ మంగళవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఏ ఓ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  ఏ ఐ ఎస్ ఏ జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం బకాయిలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చెయ్యలేదు. మరోపక్క గత మూడు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించలేక , ప్రైవేటు డిగ్రీ ,పీజీ కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటి అద్దె చెల్లించ లేకుండా నానా యాతన  పడుతూ కళాశాల నడుపుతుంటే వారు కూడా సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పీజీ కళాశాలల బందుకు పూనుకోవడం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తకుండా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

More articles

Latest article