28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కల్లు గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ గా శేఖర్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఘనంగా సన్మానించిన బోర్గం గ్రామస్తులు

 

మోపాల్, బతుకమ్మ :

 

మోపాల్ మండలం బోర్గం గ్రామంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఉన్న లవకుశ ఆంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర కల్లు గీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శేఖర్ గౌడ్‌కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఈగ సంజీవ రెడ్డి, శేఖర్ గౌడ్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఈగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఉండే సౌమ్య స్వభావం కలిగిన శేఖర్ గౌడ్‌కు చైర్మన్ పదవి రావడం ఆయన కష్టానికి దక్కిన ఫలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అలాగే బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ను కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ మెంబర్‌గా నియమించడంతో ఆయనను కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఆలయానికి, గ్రామానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామం, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లవకుశ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కో-ఆప్షన్ మెంబర్ అశోక్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు దేవాలయ అభివృద్ధికి కూడా పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈగ నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, కోశాధికారి అజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, అజయ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బాల్ రెడ్డి, బోర్గం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈగ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

 

Shekhar Goud as Chairman of Kallu Geetha Workers' Corporation

More articles

Latest article