26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవంగానే ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడే వారు, ప్రశ్నించేవారు కమ్యూనిస్టులే

 

. . . సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎన్నికల్లో ఓడినంత మాత్రన, ప్రభుత్వాలు లేనంత మాత్రాన కమ్యూనిస్టుల పనైపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవంగా ఉంటుంది. ప్రజల గుండెల్లో ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు మొలకెత్తుకొని వస్తుంది. కమ్యూనిస్టులంటే ఎవరు..? ఆకాశం నుంచి వచ్చిన వారు కాదు కదా.. అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడేవారు కమ్యూనిస్టులే. ప్రశ్నించే వారూ కమ్యూనిస్టులే అని’ సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ డి అబ్బాస్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామ్ దేవ్ వాడలోగల సీపీఐ (ఎం) కార్యాలయంలో కమ్యూనిస్టులపై ‘దుష్ప్రచారం-సోషలిజం ప్రాధాన్యత అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య తన జీవితమంతా ప్రజల కోసమే బతికారని, అలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా పుడుతుంటారని అన్నారు. ఒక కమ్యూనిస్టుగా ఉండే మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, సమాజాన్ని అర్ధం చేసుకుంటే ఎలా ఉంటారంటే సుందరయ్యను చూపించేలా ఉంటారని అన్నారు. ప్రస్తుతం మోడీ పొదుపు మంత్రం ‘పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు’ అన్న చందంగా దేశం బాగుండాలంటే పది పొదుపు సూత్రాలు పాటించాలని అంటున్నారని.. కానీ ఎవరు పాటించాలని ప్రశ్నించారు. బడా కార్పోరేట్ సంస్థలకు రాయితీలు, ట్యాక్స్ లు తగ్గిస్తున్న మోడీ సర్కార్ సామాన్యులపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ తక్కువ వాడాలని చెబుతున్నారని, రైతులు ఎరువులు తక్కువ వాడాలని అంటున్నారని అలా చెబితే కార్మికులు, రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు తీర్చాలంటే అందుకు కారణాలు విశ్లేషించి తీర్చేందుకు చొరవ చూపాల్సింది పోయి ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో సోషలిస్టుదేశాలపై ఏదో కారణం చూపుతు దాడులు చేస్తు దేశాధ్యక్షులపై నిర్బంధం ప్రయోగిస్తున్నా మోడీ కనీసం ఖండించడంలేదని అన్నారు. ఎన్నికల్లో ఎత్తుపల్లాలు సహజమని, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవడంతో కమ్యూనిస్టుల పనైపోయింది.. ప్రజలు గెలిపించడం లేదు, సీట్లు రావట్లేదనే ప్రచారం చేస్తున్నారని అన్నారు.

 

Communism will remain alive as long as there is a hunger problem.

 

దేశంలో 11 నిమిషాలకు ఒకరు ఆకలితో చనిపోతున్నారని, ఆకలికి పరిష్కారం చూపమని అడిగితే మనుషులను చంపుతున్నారని.. మనుషులను చంపినా ఆకలిని మాత్రం చంపలేకపోతున్నారని అన్నారు. ఆకలి సమస్య ఉన్నంత కాలం ఆకలి మంటల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకొచ్చి దహించివేస్తారని అన్నారు. పనైనా చూపాలి.. లేకుంటే ఆకలైనా తీర్చాలని కమ్యూనిస్టులు కొట్లాడితే ఉపాధి హామీ చట్టం వచ్చిందని ఉపాధి కూలీల మెతుకుల్లో కమ్యూనిస్టులున్నారని అన్నారు. ఎర్రజెండా అంతం చేస్తా అన్న హిట్లర్ కూడా కుక్కచావు చచ్చారని అన్నారు. ఎర్రజెండా అంటే ప్రజలే అని, కష్టజీవులే అని, అన్యాయం జరుగుతున్నంత కాలం ఎర్రజెండా బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎర్రజెండా లేకుంటే భవిష్యత్తు లేదని, దేశానికి దారి, దిక్సూచీ ఎర్రజెండానే అని అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ గత లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రిజర్వేషన్లు తొలగించి రాజ్యాంగాన్నే మార్చేస్తామని విర్రవీగారని, అలాంటి వారిని 240 సీట్లకు కట్టడి చేసింది కమ్యూనిస్టులే అని అన్నారు. అందుకే కమ్యూనిస్టుల వాయిస్ లేకుండా బడా కార్పోరేట్ కంపెనీలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీంట్లో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాడు ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టులపై దాడులు చేసి అంతం చేయాలని చూశారని, కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. 10 మంది మోడీలు వచ్చినా కమ్యూనిజాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రములు, శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, యేశాల గంగాధర్, జంగం గంగాధర్, సురేశ్, నన్నెసాబ్, కొండ గంగాధర్, సాయిలు, దేవేందర్ సింగ్, నాయకుడి శ్రీనివాస్ అంజయ్య, షంషాద్, శిల్ప లింగం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Communism will remain alive as long as there is a hunger problem.

More articles

Latest article