33.1 C
Hyderabad

జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు

. . . రూ.100 కోట్ల కు పైగా అస్తుల గుర్తింపు

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

హైదరాబాద్ జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున మల్లాపూర్ లోని అనంత లక్ష్మి కుమార్ నివాసం తో పాటు 8 చోట అవినీతి నిరోధక శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో వెంకటరమణ కాలనీ లో ఉన్న రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన, రూ. 1.05 కోట్ల నగదు, కేజికి పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు, రూ. 100 కోట్లు వరకు ఆస్తులున్నాయని గుర్తించారు. ఇంకా బంధువులు, ఇతరుల ఇండ్లలో బినామీల వద్ధ సోదాలు కొనసాగుతున్నాయి.. వివిధ బ్యాంక్ లలో ఉన్న లాకర్ లను తెరియలేదు. కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు కళ్లు బైర్లు కమ్మెల అస్తులను గుర్తించడం అధికారుల వంతైంది. జలమండలిలో దోరికింది తిమింగలం అని చెబుతున్నారు. కుమార్ వద్ద దొరికిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ 100 కోట్ల పై మాటే అంటే ఇంకా ఇతర అధికారుల వద్ద ఎంత మొత్తం పోగేసి ఉంటారని చర్చ జరుగుతుంది.

జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు

More articles

Latest article