27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ అవిర్భవ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ,ప్రపంచ థలసేమియా దినోత్సవాలను నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ బిల్డింగ్ లోరెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డునంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ

World Red Cross Foundation Day celebrations in full swing

 

….మానవ సేవే మహోన్నత సేవ అని రెడ్‌క్రాస్ సంస్థ సమాజ సేవలో, ఆపద సమయాల్లో ఎల్లప్పుడూ ముందుంటుంది” అని తెలిపారు. థలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానం పై అవగాహన పెంపొందించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా బాలభవన్‌లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు విజేతలకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం రెడ్‌క్రాస్ థలసేమియా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ సెంటర్‌లో థలసేమియా బాధిత చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ గారు 87వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డా. కె. శ్రీశైలం, మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డా. వి. రాజేష్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బొద్దుల రామకృష్ణ, రెడ్‌క్రాస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

World Red Cross Foundation Day celebrations in full swing

More articles

Latest article