25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫీజు బకాయిలను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఫీజు బకాయిలు రాకపోవడంతో అధ్యాపకులు, కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని గురువారం ఎమ్మెల్సీ కోదండరాం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల కు సంబంధించిన బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రతి నెల 600 కోట్ల రూపాయలను విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 1200 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసి మిగిలిన పెండింగ్ బకాయిలను విడుదల చేయటం లేదని వాపోయారు. వాటిని వెంటనే విడుదల చేసి వివిధ రకాలైన కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు, అధ్యాపకులకు, యాజమాన్యాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసినందున టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. నూతన కామారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా నియామకమైన కుంభాల లక్ష్మణ్ యాదవ్ కు అభినందనలు తెలియజేశారు.

More articles

Latest article