28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల లీగల్ సెల్ న్యాయవాదుల విజయోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని  భారతీయ జనతా పార్టీ ఎన్ డిఎ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సోమవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట లీగల్ సెల్ న్యాయవాదులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ   పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలకు విజయం సాధించిదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడుతున్నటు వంటి అభివృద్ధికి ప్రజలు మరొకసారి పట్టం కట్టారన్నారు. అవినీతి అరాచక పాలనను, ఓటు బ్యాంకు రాజకీయాలకు  బెంగాల్ ప్రజలు చరమ గీతం పాడారన్నారు. దేశ భద్రత, దేశ అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ పని చేస్తుందని, ఆ నమ్మకంతోనే అస్సాం, పుదుచ్చేరి రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ కి పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ న్యాయవాదులు పడిగేల వెంకటేశ్వర్, చింతకుంట సాయి రెడ్డి, బిట్ల రవి, ఎర్రం విఘ్నేష్, సుభాష్ రెడ్డి, మాణిక్ రాజ్, నరేందర్ రెడ్డి, మద్దేపల్లి శంకర్, శరత్ చంద్రా, కార్తీక్, శ్రీనివాస్ వర్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article