26.6 C
Hyderabad
Monday, August 3, 2026

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అభివృద్ధి పథంలో నడుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలన లో నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీ లను అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని, గత కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ పాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ రైతు భరోసా, రైతు భీమా, రెండు లక్షలు రుణమాఫీ వంటి పధకాలను అందిస్తున్నామన్నారు. కేసీఆర్ విద్యా వ్యవస్థను బ్రష్టు పడిస్తే రేవంత్ రెడ్డి బలోపేతం చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందెన్, ఆర్ డిఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Implements welfare schemes unlike anywhere else in the country

More articles

Latest article