. . . ప్రభుత్వానికి వరి రైతుల హెచ్చరిక
ఆర్మూర్, బతుకమ్మ:
వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కర్షకుల కన్నేర్ర కొనసాగుతుంది. ప్రభుత్వం తీరు, అధికార యంత్రాంగం ఆలస్యమైన నిర్ణయాలతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోనీ పెర్కిట్ శివాలయం వద్ద స్థానిక వరి రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోగా తీవ్ర జాప్యం చేస్తున్నందున శనివారం ఉదయం జాతీయ రహదారి 63 పై ధర్నాకు దిగారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,హమాలీల కొరత లేకుండా చూడాలని అలాగే రైతులు పండించిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలని అలాగే రైస్ మిల్లల్లో వెంటనే వరిని దించుకోవాలని రైతు నాయకులు అల్లూరి గంగారెడ్డి, పాలేపు రాజు, నచ్చు చిన్నారెడ్డి లు డిమాండ్ చేశారు.. మే నెలలో అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడిచి నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి దొడ్డు వడ్ల తో సహా సన్నవరిని తరువు లేకుండా కొనాలని తెలిపారు. లేనిపక్షంలో ఈ ధర్నాని తీవ్ర స్థాయికి తీసుకెళ్లి ఎర్ర జొన్న ఉద్యమం తరహాలో మళ్లీ వరి రైతులమంతా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

