29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోళ్ల జాప్యం పై ఎల్లారెడ్డి పల్లి వద్ద రైతుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇందల్వాయి – దర్పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో

. . . రోడ్డుపై వంట వార్పు తో నిరసన

 ఇందల్వాయి, బతుకమ్మ:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లు చేయడంలో విఫలం అవుతుండటంతో వారం రోజులుగా నియోజకవర్గంలో రైతులు ఏదో ఒక చోట నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వంలో అధికార పెద్దలు, ప్రజా ప్రతినిధుల కనీసం ధాన్యం కొనుగోలు చూపించండి విఫలం అయ్యారు అని కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి ధాన్యం కోనుగోళ్ల జాప్యంపై రైతులు  ధర్నాకు దిగారు.

Farmers protest at Yella Reddy Palli over delay in grain procurement

శుక్రవారం ఉదయం  ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతు లు ఇందల్వాయి – ధర్పల్లి రహదారిపై  బైఠాయించి ఆందోళన చేశారు. ధాన్యం తరలింపు లో జాప్యం జరుగుతుందంటూ ప్రధాన రహదారిపై వంట వార్పు నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు,బస్తాల తరలింపు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు రైతులకు నచ్చ చెప్పిన వారు ఆందోళన విరమించలేదు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసనలో వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకు  కూర్చున్నారు. దానితో ప్రధాన రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

More articles

Latest article