హైదరాబాద్, బతుకమ్మ :
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక`ష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం వెలువడిన బదిలీల్లో దులపల్లి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్/అడిషనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఎస్.రమేష్ ను హైదరాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సర్కిల్‌గా బదిలీ చేశారు. దులపల్లిలోని తెలంగాణ ఫారెస్టు అకాడమి జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నబి.ప్రవీణాను ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్‌గా బదిలీ చేశారు. రాజన్న సిరిసిల్ల ,కరీంనగర్ జిల్లా ఫారెస్ట్ అధికారిగా పని చేస్తున్న సి.హెచ్. బాలమణిని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారిగా బదిలీ చేశారు. కామారెడ్డి డీఎఫ్ వోగా పని చేస్తున్న బోగ నిఖిత వరంగల్ జిల్లా ఫారెస్టు అధికారిగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ డీఎఫ్ వోగా పని చేస్తున్న వికాస్ మీనాను ములుగు డీఎఫ్ వోగా ట్రాన్స్ ఫర్ చేశారు. మంచిర్యాల డీఎఫ్ వోగా పని చేస్తున్న శివ అన్వేష్ సింగ్ ను మహబూబ్ నగర్ డీఎఫ్ వోగా స్థానచలనం కల్పించారు. ఖమ్మం డీఎఫ్ వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ను నిజామాబాద్ డీఎఫ్ వోగా నియమించారు. మంచిర్యాల డీఎఫ్ వోగా రాహుల్ కిషన్ జాదవ్ ను నియమించగా కామారెడ్డి డీఎఫ్ వోగా నీరజ్ కుమార్ టైబర్ వల్ కు పోస్టింగ్ ఇచ్చారు. ఖమ్మం డీఎఫ్ వోగా అనూజ్ అగర్వాల్ ను, రాజన్న సిరిసిల్లా జిల్లా కరీంనగర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా ఎస్.సత్యనారాయణను నియమించారు. వికారాబాద్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పని చేస్తున్న జ్ఞానేశ్వర్ ను పీసీసీఎఫ్ కు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
