27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మే 10 న ప్రధాని మోదీ రాక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సన్నాహక సమావేశంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 10 న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు జిల్లా వాసులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలతో దేశాభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అర్బన్ నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పాగా వేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

More articles

Latest article