27.3 C
Hyderabad

మహనీయుల జయంతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ  :

 

బోధన్ పట్టణంలో ఈనెల 30న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిక్షణ కమిటీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు నీరడీ ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బోధన్ డివిజన్ పరిధిలోని బహుజనులను జాగృతం చేసి మహనీయుల జయంతోత్సవాలను ప్రతి ఏడాది నెల చివరిలో నిర్వహించడం అనావయితిగా మారిందన్నారు. ఈ సభకు ముఖ్య అధితిగా ప్రజా కవి వాగ్గేయ కళాకారులు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వస్తున్నారని, అదే రోజు సాయంత్రం భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, బొంబాయి వారిచే అమ్న, సమ్న కార్యక్రమాలు ఉంటాయన్నారు. కావున కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, కో కన్వీనర్స్ సింగడే పాండు, నీరడి రవి, కమిటీ సభ్యులు దాసరి శ్యామ్,రాహుల్, అలోక్, విట్టల్, అంబేద్కర్ సంగం నాయకులు నర్సింలు, కిషోర్ నవీన్, సురేష్, బాబ్లు  తదితరులు ఉన్నారు.

More articles

Latest article