29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజావాణి లో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 16 ఫిర్యాదులను స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలియజేశారు.

More articles

Latest article