ప్రజావాణి లో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 16 ఫిర్యాదులను స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా...