. . . ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి, బతుకమ్మ:
తల సేమియా వ్యాధితో బాధపడుతున్న రెండు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారి వేదంశ్ (2) ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్ తల సేమియా సొసైటీ నిర్వాహకులు బట్టు బరద్వాజ్ సహకారంతో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని, తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల తల్లిదండ్రులు రక్త కొరతతో ఇబ్బంది పడవద్దని వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడం కోసం ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) రెడ్ క్రాస్ సొసైటీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాతలు రక్తదానానికి ముందుకు రావాలని, వేసవి కాలం కావడంతో రక్త కొరత వలన బ్లడ్ బ్యాంకుల్లో నిలువలు తగ్గిపోయాయని అన్నారు. తల సేమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులు తమను సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. సకాలంలో రక్తాన్ని అందజేసిన నిర్వాహకులు బట్టు భరద్వాజ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
