24 C
Hyderabad
Sunday, August 2, 2026

హైకోర్టు నిర్దేశించిన గమ్యం వైపు పయనిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జిలకు స్వాగత, వీడ్కోలు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:

 

భారత సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుల మార్గదర్శకంలో త్వరితిగతి న్యాయసేవల కోసం ముందడుగులు వేద్దామని నిజామాబాద్ ఇన్ చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష అన్నారు. నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై వచ్చి, విధులు నిర్వహిస్తున్న సుగాలి నారాయణ, బదిలీపై వెళుతున్న జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపికృష్ణ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ స్వాగత, వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. సోమవారం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానం నిర్దేశించిన నియమాల అనుసారం నడుస్తూ కేసుల కట్టలను తగ్గించడానికి, పరిష్కరించడానికి పాటుపడదామని ఆమె అన్నారు. బార్ అండ్ బెంచ్ కలిసి వెలుతు, సహకరించుకుంటే న్యాయవివాదాలను పరిష్కరించే వీలుంటుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సుగాలి నారాయణ మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ లక్ష్యం త్వరితిగతిన న్యాయసేవలు న్యాయార్థులకు అందించడమేనని పేర్కొన్నారు. ఆటలలో గెలుపు ఓటములు ఉన్నట్లు న్యాయ వివాదాలలో తీర్పులు కూడా ఓకే పక్షం ఉంటాయని వాటిని స్వీకరించాల్సిందేనని అన్నారు. తన న్యాయ ప్రస్థానం తెలంగాణలో అధిక భాగం కొనసాగుతూ వస్తున్నదని అందుకు తానేంతో గర్వపడుతున్నానని అన్నారు.

మంచి మనుషుల మనసులు గెలుచుకున్నాం : జడ్జిలు ఖుష్భూ, గోపికృష్ణ

హైదరాబాద్ కు బదిలీపై వెళుతున్న ఖుష్భూ ఉపాధ్యాయ, గోపికృష్ణ లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలో మూడేళ్ల పదవి కాలం అలా గడిచి పోయిందని మంచి మనుషుల మధ్య విధులు నిర్వహించుకుంటూ పోయి మనసులు గెలుచుకున్నామనే గుర్తులు పది కాలాలపాటు గుర్తుండి పోతాయని వారు అన్నారు. మంచికి మారుపేరుగా నిలిచిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎప్పటికి మా మనసులలో చిరస్తాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. భార్యభర్తలుగా కలిసి వచ్చాము, ఆదరించారు, ప్రేమను చూపించారు, జడ్జిలుగా విధులు నిర్వహించిన కాలంలో కురిపించిన ఆప్యాయతలకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఆత్మీయతలను అందించి విధులలో అలసట అనేది లేకుండా చేసిన న్యాయవాద కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలం కలిసి వస్తే తప్పకుండా నిజామాబాద్ కోర్టుకు కలిసి వస్తామని వారు అన్నారు. బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి సుగాలి నారాయణకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. జడ్జిలు ఖుష్భూ గోపికృష్ణ లకు భగవాన్ రాథేకృష్ణ ల ఫొటో ను అందజేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య, హరి కుమార్, కీర్తి రాజ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, బార్ సంయుక్త కార్యదర్శి మానస, ఝాన్సిరాణి, కోశాధికారి మధుసుధన్ గౌడ్, క్రీడల కార్యదర్శి బైర గణేష్, సీనియర్ న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, మంచికట్ల గోవర్ధన్, మాణిక్ రాజు, మామిళ్ల సాయరెడ్డి, ఆశ నారాయణ, జక్కుల వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 

Let's move towards the destination set by the High Court

More articles

Latest article