27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కొత్తగూడెం జిల్లా లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దేవేందర్ సింగ్, పి.నాగలక్ష్మి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ నగరంలోని నాందేవ్ వాడలో తెలంగాణ రైతు సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 23,24,25 తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగాయన్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా మూడు సంవత్సరాలు జరిగిన పోరాటాలు చర్చించి, భవిష్యత్తు ప్రణాళిక రూపొందించామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు తీర్మానాలు చేశామని తెలిపారు. రైతులు పండించిన పంటను దళారి వ్యవస్థ కొంటూ రైతులకు లాభం లేకుండా చేస్తుందని, ప్రభుత్వం రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలని ఆయన కోరారు. అలాగే జిల్లా లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరిని కూడా తెరిపించాలని కోరారు. భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాలో కూడా రైతు సంఘాన్ని డెవలప్ చేయడం కోసం రైతాంగం నిజామాబాద్ జిల్లా కమిటీగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article