25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మంత్రి అజారుద్దీన్ కోదండరాం లచే ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ 

 

. . . హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, ప్రొపెసర్ కోదండరాం తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.

 

Oath-taking as members of the Legislative Council

 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

Oath-taking as members of the Legislative Council

More articles

Latest article