27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లెనిన్ ఆశయాలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారానికి లెనిన్ సిద్ధాంతాలు అవసరమని ఆర్ ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల ఆర్ ఎస్ పీ పార్టీ కార్యాలయంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వ్లాదిమిర్ లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ విముక్తి కోసం పోరాడిన మహా విప్లవ నాయకుడు లెనిన్ అని అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం, దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం లెనిన్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత సమాజ మార్పు కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్ ఎస్ పీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనిల్, పిట్ల.నరేష్, గోపాల్ సింగ్ ఠాకూర్, సుర్యపల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article