29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. ఒకేచోట మూడేళ్ళు పని చేసిన ఉద్యోగులకు బదిలీలకు అనుమతి మంజూరు చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ జీవో ఎం.ఎస్.నంబర్.38ను జారీ చేసింది. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ ను మే మాసంలో పూర్తి చేసే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్లు ఒకేచోట పని చేసిన వారికి స్థానచలం కల్పిస్తారు. బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత మూడు రోజుల్లో రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. జూన్ 1, 2026 నుంచి బదిలీలపై నిషేదం అమల్లోకి వస్తుంది. 2026 జనవరి 1 వరకు ఒకే స్థాలంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులు. ఒకేచోట నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగడానికి అనుమతించరు. బదిలీల్లో ప్రాధాన్యత విషయానికొస్తే భార్యభర్తలు(స్పౌజ్ కేసులు), రైటర్మెంట్ దగ్గరగా ఉన్న ఉద్యోగులకు, 70 శాతం వికలాంగులకు, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి, మానసిక సమస్యలు పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్తారు. క్యాడర్ లో ప్రధానంగా 40 శాతం వరకే ఉద్యోగులను బదిలీ చేస్తారు. 2027 మే 31 వరకు రిటైర్ అయ్యే వారిని వారి అభ్యర్థన ఉన్నప్పుడే బదిలీ చేస్తారు. ఉద్యోగులు 5 ఆప్షన్లు ఇవ్వవచ్చు. సాధారణంగా బదిలీల నిషేదం ఆర్థిక సంవత్సరం ప్రారంభం లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల నిషేదం ఉంటుంది. అవసరాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి నిషేదాన్ని ఎత్తివేస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అంటే 10 నుంచి 30 రోజులు మాత్రమే బదిలీల ప్రక్రియకు అనుమతిస్తారు.

More articles

Latest article