రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  . . . ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేత   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. ఒకేచోట మూడేళ్ళు పని చేసిన ఉద్యోగులకు బదిలీలకు అనుమతి మంజూరు చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ జీవో ఎం.ఎస్.నంబర్.38ను జారీ చేసింది....