25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏసీబీకి చిక్కిన మహిళ పీఎస్ సిఐ, ఎస్సైలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . క్రిమినల్ కేసులో నోటీసుల జారీ కోసం రూ.60 వేల లంచం డిమాండ్

 

వికారాబాద్, బతుకమ్మ :

 

పోలీస్ స్టేషన్ లలో లంచాలు తీసుకుంటుంటే తామేమి తక్కువ తినలేదని మహిళ  పోలీసులు కూడా అమ్యామ్యాలకు ఎగబడ్డారు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకున్న సిఐ, ఎస్సైలను ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన మంగళవారం వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్ సిఐ  సరోజ, ఎస్సైల రాణిలు స్టేషన్ బెయిల్ కేసులో లంచం తీసుకోగా విచారణలో తేలడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి కుటుంబ సభ్యులపై అతని భార్య ఫిర్యాదు చేసింది. మహిళ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని రూ.60 వేలు ఇస్తేనే నోటీసులతో సరిపెడుతామని, లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరింపులకు దిగారు. బాధితులు బ్రతిమాలడంతో రూ.40 వేలకు బేరం కుదిరింది. బాధితుడు గతంలోనే రూ.20 వేలు అప్పగించారు. మళ్లీ మహిళ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్సైలు లంచం కోసం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపడంతో సిఐ సరోజ, ఎస్సై రాణీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

More articles

Latest article